ఒక కేసు విషయంలో ఎఫ్ఐఆర్ కాపీ అడిగినందుకు ఎస్సీ నాయకుడిని హెడ్ కానిస్టేబుల్ దుర్బాషలాడిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. రాయదుర్గం మండలం 75-వీరాపురం గ్రామంలో రెండు గ్లాసుల పద్దతి, ఎస్సీలకు ఆలయం ప్రవేశం కల్పించడం లేదన్న అంశంపై స్థానికులు గతంలో గుమ్మఘట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ కాపీ కావాలంటూ ఎస్సీ నాయకుడు హెచ్.రమేష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డిని ఎఫ్ఐఆర్ కాపీ అడిగ్గా... ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఎఫ్ఐఆర్తో నీకేం పని అంటూ తిట్టడం మొదలుపెట్టాడు. అలా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించగా.. ఎస్పీ ఫిర్యాదు చేసుకొమ్మని దురుసుగా సమాధానమిచ్చాడు. దీనిపై సదరు నాయకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. హెడ్ కానిస్టేబుల్ తిట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన
కానిస్టేబుల్ వ్యవహారంపై ఈటీవీ, ఈటీవీ భారత్ లో వచ్చిన కథనానికి జిల్లా ఎస్పీ ఏసుబాబు స్పందించారు. గుమ్మగట్ట పీఎస్‌కు వచ్చిన వ్యక్తిపై హెడ్‌కానిస్టేబుల్ రఘునాథరెడ్డి దూషణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. అతడిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి: