ETV Bharat / state

వృద్ధుడే.. ఆయన చేసే పని తెలిస్తే.. షాక్ అవుతారు!

డెబ్బై ఏళ్ల వృద్ధులు చాలా వరకు ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కానీ.. ఈయన మాత్రం అలా కాదు. తన ఇంటి ఆవరణలో ఘనకార్యానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం.. ఈ వయసులో.. ఇదేం పని తాతా.. అన్నట్టుగా షాక్ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఎవరా తాత? ఎక్కడి వ్యక్తి ఆయన? ఏం చేశాడు?

వృద్ధుడు
వృద్ధుడు
author img

By

Published : Aug 21, 2021, 9:51 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు వయసు.. 7 పదుల పైనే ఉంటుంది. ఈ వయసులో.. సంపాదించింది అనుభవిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని గడిపేందుకు అలాంటి వృద్ధులు ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ.. ఈయన మాత్రం తన రూటే సెపరేట్ అన్నట్టుగా ప్రవర్తించాడు. తన ఇంటి ఆవరణలోనే 40 గంజాయి మొక్కలు సాగు చేశాడు. ఆ నోటా.. ఈ నోటా ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది.

పక్కా సమాచారం సేకరించిన ఖాకీలు.. ఆయన ఇంటికి వెళ్లి.. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆ గంజాయి మొక్కలను పరిశీలించారు. వెంటనే వాటిని తొలగించిన పోలీసులు.. మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. ఇంట్లో ఉన్న దాదాపు కిలో గంజాయిని పట్టుకున్నారు. వృద్దుడిపై కేసు నమోదు చేశారు. ఈ దాడులలో సెబ్ సి.ఐ మారుతి రావు, సిఐ శేఖర్, సిబ్బందితో దాడులు నిర్వహించారు.

ఇదీ చదవండి:

చాపకింద నీరుగా గంజాయి సాగు.. చీకటి వ్యాపారంలో బయటపడుతున్న కొత్తకోణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.