అనంతపురం జిల్లా రొద్దం మండలం ఆర్ కొట్టాల చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కర్ణాటక నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. సరకు విలువ రూ. 9 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆటోను సీజ్ చేసి.. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: నిబంధనలు పాటించని ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు