'కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండాలి... భౌతిక దూరం పాటించాలి...' ఇలా ప్రతి రోజు ప్రభుత్వం, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పత్రికా ప్రకటనలలో ప్రచారం చేస్తున్నా... అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. కూరగాయల మార్కెట్లో కనీసం భౌతికదూరం పాటించడం లేదు.
ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో ప్రజలు మార్కెట్కు తరలివస్తున్నారు. పోలీసులు ఎంత అదుపు చేసినా.. వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దుకాణాల ముందు యజమానులు కేవలం వలయాలు మాత్రమే ఏర్పాటు చేయగలిగారే తప్ప... సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచడం లేదు. ఫలితంగా కరోనా వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: ముగిసిన రంగుల పంచాయితీ... తెలుపు రంగులోకి భవనాలు