దక్షిణ మధ్య రైల్వేలోని ప్రసిద్ధమైన గుంతకల్లు రైల్వే జంక్షన్ అభివృద్ధికి, స్వచ్ఛతకు కేంద్ర బిందువుగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన" స్వచ్ఛత హీ సేవ, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్ని తూచా... తప్పకుండా పాటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ స్టేషన్. ఈ స్వచ్ఛత మెషీన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి నడుం బిగించారు....గుంతకల్లు డి.ఆర్.ఎం అలోక్ తివారి. ఇందుకోసం వేదికగా మహాత్మ గాంధీ 150వ జన్మదిన వేడుకలును ఎంచుకున్నారు. గాంధీ జయంతి రోజున రైల్వే ఉద్యోగులు, విద్యార్థులు, పట్టణ ప్రజలతో తాము భవిష్యతులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడబోమని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించడమే కాకుండా గుంతకల్లు డివిజన్ లోని 1400 మంది ఉద్యోగుల కుటుంబాలను ఈ కార్యక్రమంలో పాలు పంచుకొనేలా చేశారు.
గుంతకల్లు రైల్వే జంక్షన్ లోని ప్లాట్ ఫారంలలో భారతీయ సంస్కృతి, కళలు, చరిత్ర, ఆధునికత ఉట్టి పడే విధంగా రంగు రంగుల చిత్రాలు వేయించారు. ఇందుకుగాను స్థానికంగా ఉన్న చిత్రకారులనును ఎంపిక చేసుకొని వారితోనే చిత్రాలు వేయించామని ఇది వారికి మరింత ప్రోత్సాహకాన్నీ ఇస్తుందని గుంతకల్లు అలోక్ తివారీ అన్నారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పార్కులు, ప్రయాణికులను స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉదయం, సాయంకాలం వేళ సమయాల్లో చుట్టుపక్కల ప్రజలు, ప్రయాణికులు కాలక్షేపం కోసం ఈ ఉద్యాన వనాలకు వస్తూ తమ చరవాణులతో ప్రకృతి అందాలను ఛాయాచిత్రాలుగా తీసుకుంటూ, తమ పిల్లలతో సరదాగా గడుపుతున్నారు.
స్వచ్ఛత వైపు తాము చేస్తున్న ఈ ప్రయత్నంలో స్థానిక ప్రజలు, మున్సిపల్ అధికారులు, రైల్వే ఉద్యోగులు, రాజకీయ నాయకులు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుందని తప్పకుండా తాము అనుకున్న లక్ష్యాలను చేరుకుంటామని ఆత్మ విశ్వాసంతో డీఆర్ఎం తెలిపారు. భారత ప్రభుత్వం "ఎక్ కదం స్వచ్ఛత ఓర్ "అంటూ ముందుకు వెళ్తుంటే గుంతకల్లు రైల్వే డివిజన్ మాత్రం 10అడుగులు స్వచ్చత వైపు అడుగులు వేస్తుందని చెప్పవచ్చు.
ఇవీ చదవండి