రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాయదుర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని భూప సముద్రం, ఆవులదట్ల గ్రామాల్లో రాయితీ వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.
రైతుల కోసం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రామచంద్రారెడ్డి చెప్పారు. త్వరలోనే ప్రతి గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడమే కాక.. పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.
ఇవీ చదవండి: