అనంతపురం జిల్లా పెనుగొండలోని ఆల్విన్ కాలనీలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ ఉదయం గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వగృహం నుంచి కాలినడకన కాలనీ మొత్తం కలియతిరిగారు. ప్రజల సమస్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా కాలనీలో డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గత 30 సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు మంత్రితో మొరపెట్టుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాలను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ నిధులతో మొదట తీవ్రమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి