అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలం బ్రహ్మణపల్లి తండాలో చిరుత కలకలం రేపుతోంది. లక్ష్మ నాయక్ అనే వ్యక్తికి చెందిన గొర్రెల మందలోని రెండు పొట్టేళ్లపై దాడి చేసింది చంపేసింది.
ఈ దుర్ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. బ్రహ్మణపల్లి తండా సమీప పొలాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుతను బంధించకుంటే తాము పొలం పనులు చేసుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి చిరుత దారి మళ్లింది...జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి !