అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం ఏరియాలో దుకాణదారులు ధర్నా చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో గవిమఠం ఆస్తులు బహిరంగ వేలం వేసేందుకు సిద్ధమవుతుండగా... వేలం నిర్వహించొద్దని వ్యాపారులు డిమాండ్ చేశారు. మఠం భూముల్లో శాశ్వత, తాత్కాలిక భవనాలు 306 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వ్యాపారులు చాలా ఏళ్లుగా అద్దె కట్టకపోవడంతో... గవిమఠం ఆదాయం కోల్పోతుందని అధికారులు చెప్పారు. అందుకే వేలం నిర్వహించాలని భావిస్తున్నట్లు వివరించారు. కాగా... వేలం నిర్వహించొద్దని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేశారు. గవిమఠం వెళ్లే దారిపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ వాణిశ్రీకి వినతిపత్రం ఇచ్చారు.
ఉరవకొండలో వ్యాపారుల ఆందోళన... ఇందుకే.. - అనంతపురం జిల్లా ఉరవకొండలో దుకాణదారుల ధర్నా వార్తలు
ఉరవకొండలో గవిమఠం ఆస్తులను వేలం వేస్తున్నందున... అక్కడి దుకాణదారులు ఆందోళన చేశారు. తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.