అనంతపురం జిల్లాలోని కదిరి డివిజన్ లో 169 పంచాయతీల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. 1714 వార్డుల్లో 715 ఏకగ్రీవం కాగా, 15 వార్డులకు ఒక్కరూ కూడా నామినేషన్ వేయలేదన్నారు. పోలింగ్ సిబ్బంది సోమవారం సాయంత్రానికి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని కలెక్టర్ తెలిపారు. పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించి ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేశామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. కరోనా బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు