ETV Bharat / state

యూట్యూబ్​లో చూసి మద్యం తయారీ.. నలుగురు అరెస్ట్​

author img

By

Published : Apr 22, 2020, 4:01 AM IST

కల్తీ మద్యం తయారీ చేసి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అనంతపురం జిల్లా ఎక్సైజ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 18 కల్తీ మద్యం బాటిళ్లు, శానిటైజర్స్ స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్​లో చూసి మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

four people arrested
కల్తీ మద్యం తయారీ చేసి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు

అనంతపురంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 18 కల్తీ మద్యం బాటిళ్లు, శానిటైజర్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు యూట్యూబ్​లో కల్తీ మద్యం తయారీ విధానం తెలుసుకున్నారు. తయారు చేసిన కల్తీ మద్యం బాటిల్స్​ను గుట్టుచప్పుడు కాకుండా మందుబాబులకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇవీ చూడండి...

ప్రజల ప్రాణాలతో ఆర్​ఎంపీలు చెలగాటం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.