ETV Bharat / state

'వెంటిలేటర్లు లేక నలుగురు చనిపోయారు.. అధికారులూ పట్టించుకోండి'

అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేక 24 గంటల వ్యవధిలో నలుగురు కరోనా బాధితులు మరణించినట్లు మృతుల కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. వెంటిలేటర్ల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

four patients death in kadiri govt hospital
కదరి ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత
author img

By

Published : May 5, 2021, 4:56 PM IST

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలోని 24 గంటల వ్యవధిలో నలుగురు కొవిడ్ బాధితులు మృతి చెందారు. ఆస్పత్రి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న పాజిటివ్ బాధితులకు ఆక్సిజన్ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ... వెంటిలేటర్ సేవలు అందుబాటులో లేక ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు.. ఆస్పత్రిలో ఇంకో తొమ్మిది మంది బాధితుల పరిస్థితి విషమంగా మారిందని... మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం ఆస్పత్రులకు తరలించాలని వైద్యాధికారులు సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడే వెంటిలేటర్లను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కరోనా నియంత్రణపై మంత్రివర్గ కమిటీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.