అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఎర్రమంచిలో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు... గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుంది.
ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ విట్టల్, అతనితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందా..!
ప్రమాదానికి గురైన కారులోని వాహనచోదకుడు చేతిలో బీరు సీసా ఉంది. నుజ్జు అయినా కారులోని మృతదేహాలను తొలగించటానికి యంత్రాల ద్వారా పనులు నిర్వహిస్తుండగా... చేతిలో మద్యం సీసా లభించింది. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
మృతుల వివరాలు:
(1)రేఖ(21)కిషన్ గంజ్ నార్త్ దిల్లీ
(2)ఆంచల్ సింగ్(21)
(3)మహబూబ్ఆలం(31)ఆర్.టీ.నగర్ నార్త్ బెంగళూరు
(4)మనోజ్ మిట్టల్ (38)ప్లాటినంసిటీ, నార్త్ బెంగళూరు
ఇదీ చదవండి:
రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు అడ్డగింత.. ఎప్పుడేం జరిగిందంటే?