అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదం గ్రామంలో రైతులు ధర్నా చేశారు. గణేశ్ ఎంటర్ ప్రైజెస్ తెల్ల కంకర మిషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 14 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని క్రషర్ వారు ఆక్రమించి పెద్ద మిషన్లు వేశారని ఆందోళన చేశారు. క్రషర్ చుట్టూ పంటపొలాలు వేశామని దుమ్ము ధూళితో పంటలు నాశనం అవుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
క్రషర్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా క్వారీలో బ్లాస్టింగ్ చేయడంతో వ్యవసాయ పొలాల్లో పనులు చేసుకుంటున్న తాము తీవ్ర భయందోళనకు గురవుతున్నట్లు చదం, గొల్లాలదొడ్డి గ్రామాలకు చెందిన రైతులు చెప్పారు. సంబంధిత అధికారులు క్రషర్ లో అక్రమంగా వేసిన పెద్ద మిషన్లు తొలగించి పంట పొలాలను కాపాడాలని వారు కొరారు. ఈ విషయమై క్రషర్ మేనేజర్ మాట్లాడుతూ రెండు రోజులు సమయం ఇస్తే రికార్డులు చూపిస్తామని రైతులను సముదాయించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.