రైతులకు కావల్సిన ఎరువులు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా తమకు వ్యయప్రయాసలు తగ్గుతున్నాయని చెప్పారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం ఈదులకుంటపల్లిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు అందజేశారు.
పురుగుమందులు, విత్తనాలను డిజిటల్ కియోస్క్ ద్వారా రైతులు స్వయంగా వివరాలు నమోదు చేసుకున్నారు. పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర డబ్బులు చెల్లించిన 2 రోజులకే వచ్చాయని రైతులు సంతోషం వ్యక్తంచేశారు. ఈ విధానం ఎంతో మేలు చేసేదిగా ఉందన్నారు.
ఇవీ చదవండి..