రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వైకాపా ప్రభుత్వం వాటిని జరగనివ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎలాగైనా స్థానిక ఎన్నికలను అడ్డుకుంటారని జేసీ అన్నారు.
అనంతపురంలో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఎలక్షన్స్ జరపాలని పట్టుబట్టినా.. జగన్, ఆయన అనుచరులు అది జరగనివ్వరని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కోర్టులకు వెళ్లి వాయిదా పడేలా చేస్తారని అన్నారు. వైకాపా ప్రభుత్వానికి మిగిలిన మూడేళ్ల పాలన పూర్తయ్యేవరకు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగవని జేసీ తెలిపారు.
ఇవీ చదవండి..