ETV Bharat / state

కదిరిలో 2 అగ్నిప్రమాదాలు.. కారు, 2 ద్విచక్ర వాహనాలు దగ్ధం

author img

By

Published : Dec 23, 2020, 9:29 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో రెండు చోట్ల జరిగిన వేర్వేరు అగ్నిప్రమాదాల్లో కారు, 2 ద్విచక్రవాహనాలు, సైకిళ్లు, సామగ్రి దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.

fire accident
కదిరిలో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు

అనంతపురం జిల్లా కదిరిలో 2 వేర్వేరు చోట్ల జరిగిన అగ్నిప్రమాదాల్లో కారు, 2 ద్విచక్రవాహనాలు, సైకిళ్లు, సామగ్రి దగ్ధమయ్యాయి. కదిరిలో 42వ నంబరు జాతీయ రహదారిపై బండారునగర్ వద్ద ఆపి ఉంచిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.

కంచుకోటలో జరిగిన మరో ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాలు, సైకిళ్లు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కార్యక్రమం అనంతరం అందరూ ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గుర్తించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు.

ఇవీ చూడండి:

'అమ్మఒడి' అర్హుల జాబితాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.