అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గంజిగుంట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయగా.. అది అంటుకుని 6 ఎకరాల చెరకు తోట దగ్ధమైంది. చెరకు తోటలు పూర్తిగా కాలిపోయాయని నాగేంద్ర, ఆంజనేయలు అనే రైతులు అవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి చెరుకు సాగు చేశామని వాపోయారు. రూ.60 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: మేలపురం దుకాణంలో అగ్ని ప్రమాదం