మొక్కలు నాటి సంరక్షించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. సినిమా ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్(fight masters ram ,lakshman) అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలోని బోగసముద్రంలో సోమవారం సాయంత్రం వారు చెరువును సందర్శించారు. అనంతరం చెరువు పరిసరాల్లో కొబ్బరిమొక్కలు నాటి నీరుపోశారు. కోటి మొక్కలు నాటటం తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ప్రకృతి ప్రణామం అనే ధర్మం తెలియజేస్తూ.. ముందుకు సాగుతామన్నారు. జిల్లాలోనే ఎక్కువగా డయోరియా ఉండటంతో ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు. భూమి, నీరు, చెట్టు గొప్పతనం తెలియజేస్తూ.. మొక్కలు నాటడమే తమ ధ్యేయమన్నారు. సిద్దసమాధి యోగా గురువు రవిశంకర్ గురూజీని కలసి.. బోగసముద్రం చెరువులో మొక్కలు నాటటం సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: