ETV Bharat / state

కొవిడ్ నియంత్రణకు కృషిచేసిన అధికారులకు సన్మానం - yours foundation latest News

అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేసిన అధికారులను యువర్స్ ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది. పలు శాఖల ప్రభుత్వ అధికారులను యువర్స్ ఫౌండేషన్ ప్రతినిధులు శాలువతో సత్కరించి పూలమాలతో సన్మానించారు.

కొవిడ్ నియంత్రణకు కృషి చేసిన అధికారులకు సన్మానం

author img

By

Published : Oct 15, 2020, 3:41 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేసిన అధికారులను యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు పట్టణంలోని ఎన్జీవో సమావేశ భవనంలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ నీలకంఠారెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ పద్మలతను యువర్స్ ఫౌండేషన్ ప్రతినిధులు శాలువతో సత్కరించి పూలమాలతో సన్మానించారు.

అందుకే ప్రాణ నష్టం తక్కువ..

ధర్మవరంలో కరోనా నివారణకు అధికారులు కృషి చేయడం వల్లే ప్రాణ నష్టం తక్కువ జరిగిందని ఫౌండేషన్ కొనియాడింది. కేసుల సంఖ్య సైతం గణనీయంగా తగ్గిందని పౌండేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు పేర్కొన్నారు. అందరి సహకారం వల్లే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగామని ప్రతినిధి మధుసూదన్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి : 'ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.