అనంతపురం జిల్లా కణేకల్ రైతుభరోసా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం నింపడానికి అవసరమైన గోనె సంచులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దళారులు, పలుకుబడి కలిగినవారి మాత్రం ఇస్తున్నారని.. అధికారులను ప్రశ్నిస్తే సరైన జవాబు ఇవ్వడం లేదన్నారు. సమాచారం తెలిసి రైతుభరోసా కేంద్రం వద్దకు వచ్చిన తహసీల్దార్ ఉషారాణి.. రైతులకు సర్దిచెప్పారు. కొందరికి గోనె సంచులు ఇచ్చిన అధికారులు.. మిగిలిన వారికి వీలైనంత త్వరగా అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: కొవిడ్‌కు ఆర్‌ఎంపీ వైద్యం!