పండించిన పట్టుగూళ్లకు మద్దతు ధర లభించని కారణంగా... అనంతపురం జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. పండించిన పట్టుగూళ్లకు నిప్పంటించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. గతంలో రూ.400 నుంచి 500 దాకా పలికిన ఆదివారం కేవలం రూ.180 నుంచి 200 మాత్రమే పలికిందని వారు వాపోయారు.
తాము పండించిన పంటకు కనీస ధర రాక.. పూర్తిగా నష్టపోయామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర పలకడంతో తాము తీవ్రంగా నష్టపోతామని.. మార్కెట్ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: