అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో కురిసిన భారీ వర్షాలకు అరటి, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండలంలోని ఎల కుంట గ్రామాలలో గాలి వాన బీభత్సానికి అరటి పంట నేల వాలింది. మరికొన్ని రోజుల్లో పంట చేతికొచ్చే దశలో గాలివానకు అరటి గెలలు నేలకూలగా.. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.
అకాల వర్షాల వల్ల సుమారు రూ. 2 కోట్ల మేర పంటనష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. కనీసం పెట్టుబడి కూడా చేతికి తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: