అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో రైతులు వారి పంట రుణాల నవీకరణ కోసం ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో బ్యాంకుల వద్ద కొవిడ్ నిబంధనలు కనిపించడం లేదు. బ్యాంకు లోపలికి వెళ్లేందుకు గేటు ముందు గుంపులు గుంపులుగా నిలబడ్డారు. బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది దఫాల వారిగా కొంతమందిని లోపలికి పంపిస్తున్నారు. చేతగాని వృద్ధులు ఆ గుంపులో నిలబడే శక్తి లేక దూరంగా కూర్చొని తమ పంట నవీకరణ ఎప్పుడు అవుతుందోనంటూ నిరీక్షస్తున్నారు.
తమ పంట రుణాల నవీకరణ కోసం వాటికి సంబంధించిన పత్రాలను బ్యాంకుకు సమర్పించి పది రోజులైనా ఇప్పటివరకు తమ వంతు రాలేదని రైతులు వాపోతున్నారు. తమ వంతు ఎప్పుడొస్తుందోనని బ్యాంకు వద్ద పడిగాపులు పడుతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ మండలంలోని అన్ని పంచాయతీలు నవీకరణ చేసే బదులు ఒక్కో రోజు ఒక్కో పంచాయతీ చొప్పున పంట రుణాల నవీకరణ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని రైతులంటున్నారు. లేకపోతే పంచాయతీలకే బ్యాంకు అధికారులు వచ్చి రెన్యువల్ చేస్తే బాగుంటుందంటున్నారు.
ఇదీ చదవండి: మృతదేహం అప్పగింతకు లంచం డిమాండ్ చేసిన కామాటి సస్పెన్షన్