అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో వేరుశనగ విత్తన పంపిణీ.. గందరగోళానికి దారితీసింది. అందుబాటులో ఉన్న K6 రకం విత్తనాల పంపిణీ పూర్తవగా.. K9 రకం విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటిని తీసుకునేందుకు రైతులు ఆసక్తి కనపరచలేదు. ఈ కారణంగా.. అధికారులు విత్తన పంపిణీ నిలిపేయడం.. రైతుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. రాత్రి నుంచి క్యూలైన్లలో ఉన్న తమను ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారని.. విత్తనాల పంపిణీ అర్థంతరంగా నిలిపేశారని అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వాగ్వాదానికి దిగారు. చివరికి.. రైతులు నిరాశగా వెనుదిరిగారు.
రాత్రంతా వేచి ఉన్నా.. ఖాళీ చేతుల్తో వెనుదిరిగారు! - farmers
వేరుశనగ విత్తనాల కోసం పడిగాపులు కాసిన రైతులకు నిరాశే మిగిలింది. అధికారులతో తమ గోడును ఎంత చెప్పినా లాభం లేకపోయింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన.. అన్నదాతలను ఆవేదనకు గురిచేసింది.
అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో వేరుశనగ విత్తన పంపిణీ.. గందరగోళానికి దారితీసింది. అందుబాటులో ఉన్న K6 రకం విత్తనాల పంపిణీ పూర్తవగా.. K9 రకం విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటిని తీసుకునేందుకు రైతులు ఆసక్తి కనపరచలేదు. ఈ కారణంగా.. అధికారులు విత్తన పంపిణీ నిలిపేయడం.. రైతుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. రాత్రి నుంచి క్యూలైన్లలో ఉన్న తమను ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారని.. విత్తనాల పంపిణీ అర్థంతరంగా నిలిపేశారని అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వాగ్వాదానికి దిగారు. చివరికి.. రైతులు నిరాశగా వెనుదిరిగారు.
Body:కలంకారి అంటే చటుక్కున గుర్తొచ్చే పట్టణం శ్రీకాళహస్తి. కోట్లకు పడగలెత్తి దేశ ,విదేశాల్లో భారీ స్థాయిలో వ్యాపారం చేసి కళాకారులు ఇక్కడ ఉన్నారు . పూట గడవని స్థితిలో ఈ వృత్తిని నమ్ముకొని చీకు , చింత లేకుండా ఉన్నంతలో కుటుంబాలను పోషించుకుంటూ వచ్చేవారు లేకపోలేదు. శ్రీకాళహస్తిలో కలంకారి హస్త కల ఎంతోమందికి ఉపాధి చూపుతుంది . శ్రీకాళహస్తి పట్టణం భాస్కర్ పేటకు చెందిన గురు శిష్య పరంపర ట్రైనింగ్ ఇన్ కలంకారి, పెయింటింగ్స్ అనే సంస్థ .ఎంతోమంది మహిళలకు ఉపాధి చూపుతుంది. ఆంధ్ర మహాభారతం , రామాయణం , భాగవతం తో పాటు పురాణాల్లోని ఇతి వృత్తాలను ఆధారంగా కలంకారి వస్త్రాలపై బొమ్మలకు జీవం పోసి తయారుచేసే ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంటూ వచ్చేది . కలంకారి బొమ్మలకు జీవం పోయాలంటే ఎంతో కష్టమైన పని .కలంకారి వస్త్రంపై సంపూర్ణ రామాయణం, భాగవత ఘట్టాలు తదితర బొమ్మలతో సిద్ధం చేయాలంటే నెలలపాటు కళాకారులు శ్రమించాల్సిన పరిస్థితి . ఒకప్పుడు ఇలాంటి వాటికి మంచి అవకాశాలు వస్తూ వచ్చాయి. క్రమేణా మార్కెటింగ్ వసతి చాలా వరకు తగ్గిపోయింది . ఇలాంటి చిత్రాలు కేవలం చిత్రపటాలు గా ఉంచుకోవడానికి పరిమితం కావడం, అందులోనూ ధరలు కూడా అనూహ్యంగా ఉండటతో ఉత్పత్తులు అమ్ముడు పోయే కావు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల అభిరుచులకు అనుగుణంగా కలంకారీ వస్త్రాలను చీరల గా, చుడిదార్ గా వివిధ రకాల అలంకరణకు వినియోగించుకోవడం ఫ్యాషన్ గా మారింది. ఇతిహాసాల తయారీని పక్కన పెట్టి కళాకారులు ట్రెండ్ మార్చారు . అంతర్జాలంలో వస్తున్న డిజైన్లకు తగ్గట్లుగా పుష్పాలు, తీగలు, రెమ్మలు, ప్రకృతి అందాలు ఆకట్టుకునే చిన్నపాటి బొమ్మలతో వస్త్రాల తయారీకి సిద్ధమయ్యారు. ప్రపంచ మార్కెట్ లో ఈ తరహా వస్త్రాలకు మార్కెటింగ్ వసతులు బాగుండడంతో కళాకారులు ఈ తరహా పనులకు శ్రీకారం చుట్టారు . నవ్యతను చాటే ఎన్నో డ్రెస్సులు కాస్త తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడంతో ఉపాధి పొందే వాళ్లకు చేతినిండా పని అందుబాటులోకి వచ్చింది.
Conclusion:ఆకట్టుకునే డిజైన్లను భారీగా ముద్రించడం కలంకారీ కి రంగులు జోడించి మహిళల తయారుచేసే కలంకారి చీరలు, చుడిదార్ లు మంచి డిమాండ్ లభిస్తుంది. తక్కువ ఖర్చుతో నవ్యతను చాటడంతో మహిళలకు చేతినిండా ఉపాధి లభిస్తుంది. బైట్స్ 1 ముని రాఘవులు, 2. సుమంగలి, 3. యశోద. 4. లీలావతి. ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.