ETV Bharat / state

FARMERS AGITATION: భూమి సర్వే పనులను అడ్డుకున్న రైతులు - ఆంధ్రప్రదేశ్ వార్తలు

టోల్ గేట్ ఏర్పాటు కోసం భూమి సర్వేకు వచ్చిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం వడ్డిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న టోల్ గేట్ నిర్వహణకు కావాలిసిన భూముల సర్వేకోసం అధికారులు పోలీసులతో రావడంతో రైతులు తిరగబడ్డారు.

farmer-agitate-with-police
భూమి సర్వే పనులను అడ్డుకున్న రైతులు
author img

By

Published : Aug 12, 2021, 12:57 PM IST

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వడ్డిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న టోల్ గేట్ భూమి కోసం సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. టోల్ గేట్ నిర్వహణ కోసం పక్కన ఉన్న పొలాలు తీసుకోవాలని సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో వచ్చారు. తమకు పరిహారం ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అన్న విషయం తేలిసాకే సర్వే చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగి సర్వే పనులను అడ్డుకున్నారు.

తమ భూముల విలువ బహిరంగ మార్కెట్​లో అధికంగా ఉందని ప్రభుత్వ రికార్డుల ప్రకారం చాలా తక్కువగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ ధర ఆధారంగా మాకు పరిహారం ఇవ్వాలని.. లేకుంటే మా భూములు ఇవ్వబోమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం కోసం ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపి రైతులను శాంతింపజేశారు.

ఇదీ చదవండి:

'పార్లమెంట్ సమావేశాలు జరగలేదనే ప్రజలు అనుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.