ETV Bharat / state

గ్రామ సచివాలయానికి తాళాలు వేసి రైతుల ఆందోళన

అనంతపురం జిల్లా ముద్దినాయనిపల్లి గ్రామ సచివాలయానికి రైతులు తాళాలు వేసి నిరసన తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాల వివరాలను ఆన్​లైన్​లో పొందుపరచాలని డిమాండ్ చేశారు.

Farmers' agitation for locksmithing village secretariat in kalyanadurgam ananthapuram district
గ్రామ సచివాలయానికి తాళాలు వేసి రైతుల ఆందోళన
author img

By

Published : May 4, 2020, 6:19 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనిపల్లి గ్రామ సచివాలయానికి రైతులు తాళాలు వేశారు. గ్రామపంచాయతీ పరిధిలోని రైతుల పాసు పుస్తకాల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయడానికి వారి నుంచి రూ.30 వేలు వసూలు చేశారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.

ఆగ్రహించిన రైతన్నలు సిబ్బందిని బయటకు పంపి సచివాలయానికి తాళాలు వేశారు. తమ సొమ్మును వెంటనే ఇవ్వాలని, లేదా పాసు పుస్తకం వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలని డిమండ్ చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

నిరుపేదలకు పూర్వవిద్యార్థులు నిత్యావసర వస్తువులు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.