అనంతపురం జిల్లా కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. చిన్న, సన్నకారు రైతుల భూములు సేకరించి.. కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఎందరో రైతులకు జీవనాధారమైన భూములను తీసుకోకూడదని అన్నారు. అధికారులు స్పందించాలని కోరారు. రైతులు కార్యాలయం ముందు బైఠాయించి 'ప్రాణాలైనా ఇస్తాం.. భూములు ఇవ్వం' అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలన్నారు.
ఇదీ చదవండి: