అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. కళ్యాణదుర్గం మండలం ఉప్పొంకలో అప్పుల బాధ తాళలేక ఉరివేసుకుని రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
కళ్యాణదుర్గం మండలం ఉప్పొంక గ్రామానికి చెందిన నారాయణప్ప తనకున్న ఒకటిన్నర ఎకరం పొలంతో పాటు మరి కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ సారి పంట దిగుబడి సరిగా రాకపోవడంతో పెట్టిన పెట్టుబడి, అప్పులు ఎలా తీర్చాలా అని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం పొలానికి వెళ్తున్నానని చెప్పి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీచదవండి.