అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన జయన్న వేరుశెనగ పంట వేశాడు. పొలానికి రక్షణగా కంచె ఏర్పాటు చేసుకున్నాడు. రోజూలాగే పొలంలోని కంచెకు విద్యుత్ సరఫరా ఇచ్చి వెళ్ళాడు. ఉదయం వెళ్లేసరికి విద్యుధాఘాతంతో కంచెలో జిక్కుకొని జింక మృతి చెందింది.
ఆ జింక మృతదేహాన్ని బయటకు తెసే క్రమంలో రైతు జయన్నకు కరెంట్ షాక్ కొట్టింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ రైతును గమనించిన చుట్టుపక్కల రైతులు.. వెంటనే ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: