అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం వీరాపురం గ్రామంలో... విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. పొలంలో విద్యుత్ తీగలు మరమ్మతు చేస్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని తోటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి