అనంతపురం జిల్లా తనకల్లు మండలం రాసినేపల్లిలో అప్పుల బాధతో రైతు జయరాం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయరాం మూడు ఎకరాల పొలంలో బోరు బావులు తవ్వించాడు. కుటుంబ పోషణ, పంటల సాగుకు చేసిన అప్పులు ఎక్కువ అయ్యాయి.
వాటిని తీర్చేమార్గం లేకపోవటంతో పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి.. చికిత్స కోసం కదిరి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయరాం మృతి చెందాడు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని .. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: