వైకాపా నేతల బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరం రాయలచెరువు గ్రామానికి చెందిన మారుతి అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడ్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ పరామర్శించారు. 50 ఏళ్లుగా ధర్మవరం పరిధిలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులపై, స్థానిక వైకాపా నాయకుడు ప్రతాప్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే మారుతి ఆత్మహత్యాయత్నం చేశాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వైకాపా నాయకుల అఘాయిత్యాలు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సూర్యనారాయణ హెచ్చరించారు..
ఇదీ చూడండి: మెట్రో స్టేషన్లో రైలు కదలగానే దూకేసింది!