అనంతపురం జిల్లా కనేకల్ చెరువులో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. తన నలుగురు పిల్లలతో కలిసి మాధవయ్య అనే వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు తండ్రి, పిల్లలను కాపాడారు. అనంతరం వారిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.
మనో వేధనకు గురై..
ఉరవకొండకు చెందిన మాధవయ్య ధర్మవరంలో చేనేత మగ్గం నేస్తూ..కుటుంబాన్ని పోషించుకునేవాడు. కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మాధవయ్య భార్య బాలమ్మ ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూసింది. అప్పటి నుంచి మనో వేదనకు గురైన మాధవయ్య..తన ముగ్గురు కూతుళ్లు, కుమారుడితో కలిసి ఉరవకొండకు వచ్చి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మరణం, కుటుంబ భారం మోయలేక మనస్థాపం చెంది నలుగురు పిల్లలతో కలిసి కనేకల్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు సకాలంలో స్పందించటంతో ఐదుగురిని ప్రాణాలతో కాపాడగలిగారు. ప్రాణాలతో బయటపడ్డ ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీచదవండి:
HC: ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం.. రెండు వారాల్లో బిల్లులు చెల్లించాలని ఆదేశం..