ETV Bharat / state

ఎమ్మెల్యే కేతిరెడ్డి రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు: మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆగ్రహం

న్యాయవాది నరేంద్రను పోలీసులతో పిలిపించి దాడి చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఖండించారు. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దౌర్జన్యాలు, అక్రమాలకు అదుపు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ex mla suryanarayana fires on kethireddy, allegations on dharmavaram mla
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆరోపణలు, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ
author img

By

Published : Apr 2, 2021, 4:38 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అరాచకాలు అధికమయ్యాయని.. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భాజపా కార్యకర్త నరేంద్రను ఆయన పరామర్శించారు. న్యాయవాదిని పోలీసులతో పిలిపించి అతడి మీద దాడి చేశారంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోయిందని విమర్శించారు. పోలీసులూ ఆయనకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. కోర్టును ఆశ్రయించి మొదటి ముద్దాయిగా వెంకట్రామిరెడ్డి, రెండో ముద్దాయిగా సీఐ కర్ణాకర్​పై కేసు నమోదు చేయిస్తామన్నారు. దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతూ.. ఆ రక్తపు మరకలతోనే ఎమ్మెల్యే రూ. 200 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించాలి: ఆర్టీసీ ఎండీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.