ETV Bharat / state

'బాధలు చెప్పుకుందామని పోతే.. కండువా కప్పి పార్టీలోకి రమ్మన్నారు'

ప్రజల కష్టాలు తీర్చాల్సిన ఎమ్మెల్యే బలవంతంగా కండువాలు కప్పి పార్టీలోకి లాగడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే ఈరన్న పేర్కొన్నారు. అనంతపురం జిల్లా వై.బి. హళ్ళి గ్రామానికి చెందిన పలువురిని తేదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బకాయిల కోసం వెళితే ఎమ్మెల్యే కండువాలు వేశారని పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించారు.

Ex MLA Eeranna
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న
author img

By

Published : Dec 1, 2020, 7:59 AM IST

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న

గత మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న తమకు రెండున్నర సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వలేదని తెలిపారు. తమ బాధలు చెప్పుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామిని కలిస్తే ఆయన వైకాపా కండువా కప్పి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పంపారని ఆరోపించారు. తామంతా ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి అభిమానులమని.. ఎప్పటికీ తెదేపాకు విధేయులుగా ఉంటామని నిరూపించుకునేందుకే మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా తెదేపా కండువాను వేయించుకున్నట్లు పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో వై.బి. హళ్ళి గ్రామానికి చెందిన పలువురిని మాజీ ఎమ్మెల్యే ఈరన్న తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజల కష్టాలు తీర్చాల్సిన ఎమ్మెల్యే బలవంతంగా కండువాలు కప్పి పార్టీలోకి లాగడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే ఈరన్న మండిపడ్డారు.

ఇవీ చూడండి...

కళ్యాణదుర్గం పీఎస్​​లో బాలిక అదృశ్యంపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.