ETV Bharat / state

'సీఎం వైఖరితో సీమ ప్రాజెక్టులు వివాదాలుగా మారాయి' - కాలువ శ్రీనివాసులు

సీఎం జగన్​ వైఖరితో సీమ ప్రాంతంలోని ప్రాజెక్టులు వివాదాలకు దారి తీస్తున్నాయని తెదేపా నేత కాలువ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు సీమను శత్రు ప్రాంతంగా చూసే వాతావరణం సృష్టించారని మండిపడ్డారు.

ex minister kaluva srinivasulu
ex minister kaluva srinivasulu
author img

By

Published : Aug 11, 2020, 11:35 PM IST

రాయలసీమకు సాగునీరు ఇచ్చేందుకు చంద్రబాబు నిరంతరం తపించారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ఒక్క అనంతపురం జిల్లాకే 10 వేల కోట్ల రూపాయలను నీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టారని తెలిపారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను జగన్.. వివాదాల కేంద్రాలుగా మార్చారని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాయలసీమను శత్రు ప్రాంతంగా చూసే వాతావరణం జగన్ సృష్టించారని ఆరోపించారు.

ముచ్చుమర్రి ప్రాజెక్టులో అదనంగా పంపులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్న వాడుకోలేదని విమర్శించారు. కొత్త ప్రాజెక్ట్ పేరు పెట్టి ఆయకట్టు పెరగకపోయినా రాయలసీమ ప్రయోజనాలను సీఎం వివాదంగా మార్చారని ధ్వజమెత్తారు. ముచ్చుమర్రి కింద 12 పంపుల నిర్మాణం పూర్తి చేస్తే, కర్నూలు జిల్లా మొత్తానికి సాగునీరు అందేదని వివరించారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ లో రాయలసీమ ప్రాజెక్టులకు చేటు తెచ్చేలా వివాదాలు రావడానికి జగన్ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.