ఏడాదిన్నర గడవకముందే వైకాపా పాలన ప్రజావ్యతిరేకతను చవి చూస్తోందని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో తెదేపా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాలవ శ్రీనివాసులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. పాతూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 250 వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరాయి.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని.. అందుకే తెదేపాలో చేరుతున్నారని కాలవ పేర్కొన్నారు. అవినీతి అరాచక పాలనకు స్వస్తి పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైకాపా కుటుంబాల చేరికతో తెదేపా మరింత బలోపేతమవుతుందని చెప్పారు.
ఇదీ చదవండీ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు