కరోనా వైరస్‌తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని రెడ్స్ స్వచ్ఛంద సంస్థ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్స వాన్ని పురస్కరించుకుని కార్యాలయ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వలస కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికితమ వంతు బాధ్యతగా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ కో ఆర్డీటీ ఎల్లప్ప తెలిపారు.
ఇదీచదవండి
ఏపీ సాండ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ఎం.హరి నారాయణకు బాధ్యతలు