ETV Bharat / state

తెరుచుకోనున్న బడులు-గురువుల్లో మొదలైన గుబులు

author img

By

Published : Oct 31, 2020, 6:58 PM IST

రాష్ట్రంలో నవంబరు 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులందరూ ‘కొవిడ్‌’ నిర్ధరణ ధ్రువీకరణ పత్రం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గురువులకు కరోనా గుబులు పట్టుకుంది. స్వాబ్‌ సేకరణ కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

schools reopening…teachers feeling tension
తెరుచుకోనున్న బడులు-గురువుల్లో మొదలైన గుబులు

రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 2 నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఉపాధ్యాయులందరూ ‘కొవిడ్‌’ నిర్ధరణ ధ్రువీకరణ పత్రం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అనంతపురం జిల్లాలోని టీచర్లు స్వాబ్‌ సేకరణ కేంద్రాలకు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. ‘నమూనాల కేంద్రాలకు టీచర్లతోపాటు అనుమానిత రోగులు వస్తున్నారు. గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా కొందరికి కరోనా ఉన్నట్లు తేలుతోంది. దీంతో గురువుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు సంచార సేకరణ కేంద్రాలను ఎత్తేశారు. అనంత నగరంలోని సర్వజన ఆస్పత్రిలో మాత్రమే నమూనాల సేకరణ కేంద్రం ఉంది. ఇక్కడికి రెండు రోజులుగా వందలాది మంది ఉపాధ్యాయులు తరలి వస్తున్నారు. మరో నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేకరిస్తున్నట్లు ప్రకటించినా.. స్పష్టత లేదు.

18 వేల మందికి..

జిల్లా వ్యాప్తంగా 18వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్‌ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలి. పాఠశాల విధులకు వెళ్లాలంటే ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిందే. దీంతో గురు, శుక్రవారం ఉపాధ్యాయులు అనంత ఆస్పత్రిలో క్యూ కట్టారు. ఆస్పత్రిలో అదనపు కేంద్రాలు, సిబ్బందిని కేటాయించలేదు. ఒక కేంద్రంలోనే నమూనాలు తీస్తున్నారు. ఫలితంగా రెండుమూడు గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

సంచార కేంద్రాలేవీ..

మూడు రోజులుగా సంచార నమూనాల సేకరణ కేంద్రాలు పని చేయడం లేదు. ఏజెన్సీ సిబ్బందిని తొలగించడంతో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేకరిస్తున్నారు. ఉపాధ్యాయులు పనిచేసే మండలాల్లోని పీహెచ్‌సీల్లో నమూనాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఎక్కువ మంది అనంత, హిందూపురం, కదిరి, తాడిపత్రి, ధర్మవరం, రాయదుర్గం, గుంతకల్లు పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. దీంతో నియోజకవర్గ కేంద్రాల్లోని ఆసుపత్రులకు తరలివస్తున్నారు.

పెరిగిన నమూనాలు..

రెండు రోజులుగా నమూనాల సంఖ్య 10 వేలు దాటిపోతోంది. ఉపాధ్యాయులు కరోనా పరీక్షలు చేయించుకోవడమే కారణం.

1లోగా పరీక్షలు చేయించుకోవాలి..

ప్రతి ఉపాధ్యాయుడు నవంబరు 1వ తేదీ లోపు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని డీఈఓ శామ్యూల్‌ ఆదేశించారు. శనివారం అగళి, అమరాపురం, బుక్కపట్నం, చిలమత్తూరు, గోరంట్ల, గుడిబండ, హిందూపురం, కొత్తచెరువు, లేపాక్షి, మడకశిర, పరిగి, పెనుకొండ, పుట్టపర్తి, రొద్దం, రొళ్ల, సోమందేపల్లి మండలాల్లోని ఉపాధ్యాయులు సంబంధిత ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలి. వివరాలను ఒకటో తేదీ సాయంత్రం 4గంటల్లోగా డీఈఓ కార్యాలయానికి మెయిల్‌ ద్వారా తెలపాలన్నారు.

ఇవీ చదవండి: అన్నదాతను కన్నీరుపెట్టిస్తే.. పుట్టగతులుండవు; పల్లె రఘునాథ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.