అనంతపురం జిల్లా గుడిబండ మండలం మందలపల్లి తాండ, ముత్తుకూరు తాండల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. భారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 1250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గోపీనాయక్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారైన అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి...