బుధవారం ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. సీఎం అయిన 14 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాలకు 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ఘనత సీఎం జగన్‌దేనని ముఖ్య అతిథిగా హాజరైన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కొనియాడారు. జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి ఆయన పాలాభిషేకం నిర్వహించారు. 993 సంఘాలకు 7.57 కోట్ల చెక్కును ఆవిష్కరించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, అక్కాచెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు.
అయితే కొంతమంది మహిళల తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదంటూ మాజీ ఎమ్మెల్యేను కలిసి.. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇవీ చదవండి: అనంతపురం జిల్లాలో భారీ వర్షం