ETV Bharat / state

జనావాసాల్లోకి భల్లూకం.. భయాందోళనలో ప్రజలు - elugubanti_halchal

అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి జనావాసాల్లోకి వచ్చింది. అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో కలకలం సృష్టించింది.

_elugubanti_halchal_
ఎలుగుబంటి కలకలం
author img

By

Published : Aug 17, 2021, 9:45 AM IST

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని అంగన్వాడీ భవనం వెనుక.. ఓ ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ఎలుగుబంటిని చూసి కొందురు భయపడి అరుస్తూ పరుగులు పెట్టారు. బెదిరిన ఆ ఎలుగు.. దగ్గరలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది.

స్థానికులు దాన్ని వెంబడిస్తూ అటవీ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా.. అది కనిపించలేదు. ఈ విషయమై అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. భయాందోళనకు గురైన బ్రహ్మసముద్రం గ్రామస్తులు.. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందన్నారు.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్​సభ స్పీకర్ ఓంప్రకాశ్‌ బిర్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.