అనంతపురం జిల్లా పామిడి మండలం అక్కజాంపల్లి గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై పామిడి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఈ దాడులు చేసినట్లు సీఐ శ్యామ్ రావు తెలిపారు. 8 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి 2 లక్షల 91,840 నగదు స్వాధీనం చేసుకున్నారు.
8 చరవాణిలు, 14 ద్విచక్ర వాహనాలు సైతం పట్టుబడినట్టు తెలిపారు. ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేకాట, మట్కా, అక్రమ ఇసుక, మద్యం రవాణా చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇవీ చూడండి: