కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ... ప్రజా కార్యకలాపాలు నడిచేలా లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. లాక్ డౌన్ 4 నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో వేటికి మినహాయింపులు ఉంటాయి .. నియమ నిబంధనలు ఎలా ఉంటాయన్నది ఎస్పీ సత్య యేఏసుబాబుతో కలసి వివరించారు.
జిల్లాలోని హిందూపురం పట్టణం మొత్తం కంటైన్మెంట్ జోన్ లో ఉంటుందని.. మిగిలిన ప్రాంతాల్లో కేసులు లేని చోట కంటైన్మెంట్లకు మినహాయింపులు ఇస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన నియమాలు పాటిస్తూ.. స్థానికంగా ఎలాంటి వాటికి అనుమతులు ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలన్నది అధికారులు సూచిస్తారని చెప్పారు.
అయితే మినహాయింపులు ఇచ్చినంత మాత్రాన అందరూ ఒక్కసారిగా రోడ్లపైకి రావద్దని.. వైరస్ను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వృద్ధులు, పదేళ్ల లోపు చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు బయట రాకూడదని ఎస్పీ సత్య యేసుబాబు సూచించారు.
ఇదీ చూడండి ఏపీ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు