గత వారం అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి అటవీ ప్రాంతంలో చాందిని అనే మహిళ హత్యకు గురైన ఘటనలో గంగాధర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రమ్య తెలిపారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అన్నారు. సెట్టూరు మండలం మంగంపల్లి గ్రామానికి చెందిన చాందినితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అదే గ్రామానికి చెందిన గంగాధర్ ఆమెతో గొడవపడ్డాడు. ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునులిమి చంపినట్లు డీఎస్పీ రమ్య వివరించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు చెప్పారు. మృతురాలి చరవాణి స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీ చదవండి: ఆలయ భూమిలో సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భాజపా ఆందోళన