మద్యం మత్తులో సొంత అన్ననే హత్య చేసిన ఘటన అనంతపురంలోని ప్రియాంకనగర్లో జరిగింది. ఖాదర్ వలీ, జావీద్ హుస్సేన్ ఇద్దరు అన్నదమ్ములు. కారు డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన జావిద్ హుస్సేన్ తరచూ తన అన్నతో గొడవ పడేవాడిని స్థానికులు తెలిపారు.
గురువారం(జులై 1)న ఇద్దరి మద్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న జావిద్ హుస్సేన్.. తన అన్న ఖాదర్వలీపై కత్తితో దాడి చేసినట్లు బందువులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఖాదర్ వలీని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: