DRUGS: అనంతపురం జిల్లా గుంతకల్లులో డ్రగ్స్ కలకలం రేగింది. గోవా నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్తున్న 20 గ్రాముల కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. రైల్వేస్టేషన్ పార్సిల్ కార్యాలయం వద్ద డ్రగ్స్ పంచుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన పఠాన్ ఫిరోజ్ ఖాన్, గోవాకు చెందిన కరణ్ షిండే, ఆకాష్ గంగూలీ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా.. గోవాకు చెందిన కృష్ణ, రోనాల్డ్ అనే ఇద్దరు నిందితులు పరారైనట్లు తెలిపారు. అయితే.. వీటిని హైదరాబాద్‌లో ఎవరికి అమ్ముతున్నారు..? మార్గ మధ్యంలో ఇంకా ఎవరికైనా అందజేశారా..? దీని వెనుక ఎవరి ప్రమేయం ఉంది? అనే కోణంలో విచారణ చేపడతామని గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప వెల్లడించారు.
ఇదీ చదవండి: