ETV Bharat / state

తాగునీటి సమస్యతో విద్యార్థుల అవస్థలు

అనంతపురం జిల్లా కుందుర్పిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాగేందుకు నీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

author img

By

Published : Jul 19, 2019, 3:28 AM IST

తాగునీరు
తాగునీటి సమస్యతో విద్యార్థుల అవస్థలు

అనంతపురం జిల్లా కుందుర్పిలోని ప్రభుత్వ పాఠశాలలో మంచి నీటి సమస్య.. విద్యార్థులను వేధిస్తోంది. దాతలు మంచినీటి శుద్ధి యంత్రాన్ని విరాళంగా ఇచ్చినా.. అవసరమైనంతగా సరిగా నీరు అందటంలేదు. బొట్లుబొట్లుగా వస్తున్న నీటినే విద్యార్థులు పట్టుకుని తాగుతున్నారు. మరుగుదొడ్లు వాడాలంటే ఇక అంతే.. పాఠశాలకు కొంత దూరంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నుంచి నీటిని తెచ్చి వాడుకుంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇకనైన అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి

కొత్తకోట మిస్టరీ... ఆ ముగ్గురినీ హతమార్చింది ఎవరో!

Intro:ap_rjy_97_18_bjp national leader _purandeswari_press meet_av_c17
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరు లో భాజపా శక్తి కేంద్ర ప్రముఖ్ల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భాజపా జాతీయ నాయకురాలు పురందేశ్వరి గురువారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. భాజపా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి ఏం అవసరం వచ్చి నా కేంద్రంనుంచి సహాయం అందించనున్నారన్నారు. గతంలో తెదేపా ప్రభుత్వం భాజపాపై దుష్ప్రచారం చేసిందని గుర్తించిన ప్రజలు తెదేపాకు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఒక దుగరాజపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంట్ తప్ప కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేర్చింది అన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పిస్తూ అధిక నిధులు కేటాయించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో తెలుగు ప్రజలను ఏవిధంగా మోసం చేశారో ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే తీరులో మోసం చేస్తున్నారన్నారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పిన తర్వాత కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం సరికాదన్నారు. అప్పుడు తెదేపా ప్రభుత్వం కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి విభజించు పాలించు అన్న తీరులో పాలన సాగించారని ఇప్పుడు వైకాపా ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తోందన్నారు. భాజపా చేసిన అభివృద్ధిని చూసి దేశంలోని ప్రజలంతా భాజపా వైపు చూస్తున్నారన్నారు. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ప్రధానమంత్రి స్కూటీ యోజన పథకం కింద పదోతరగతి ఉత్తీర్ణత చెందిన విద్యార్థులకు స్కూటీలు అందజేస్తారని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మి మోసపోవద్దు అన్నారు. అలాంటి పథకం ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో వెల్లడిస్తారని అన్నారు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.