Water problem: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం ఎస్.ముదిరెడ్డిపల్లిలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. గడిచిన మూడు సంవత్సరాలుగా గ్రామస్థులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో.. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి ప్రాణాలను ఫణంగా పెట్టి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊళ్లో ఉన్న ఒక్క బోరుకు పరికరాలు అమర్చకుండా వదిలేశారని.. నీటి సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతున్నా.. పట్టికోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. నీటి సమస్య కారణంగా.. నాలుగు రోజులకోసారి స్నానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తిరిగే నాయకులు.. తమ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదంటుని మండి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే అనుచరుడు భూకబ్జా చేశారంటూ.. కర్నూలులో వృద్ధ దంపతుల ఆందోళన